2023 లోనూ గుక్కెడు మంచినీళ్లు దొరకని గ్రామాలు ఎన్నో..
టెక్నాలజీ పరంగా చాలా ముందుకు వెళ్తున్న సమయం ఇది. డిజిటల్ ప్రపంచంలో ఎంతో ముందుకు వెళ్తున్న మన దేశంలో ఇప్పటికీ తాగటానికి కూడా నీళ్లు లేకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ వివరాలు..
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నాళ్లు అయినా కూడా ఇప్పటి వరకు దేశంలో కొన్ని రాష్ట్రాల్లోని మారుమూర ప్రాంతాల్లో కరెంట్ అందడం లేదు. కరెంటు సంగతి ఏమో కానీ కనీసం తాగు నీరు కూడా లభించని గ్రామాలు ఎన్నో ఉన్నాయి.
నీటి ఎద్దడి కారణంగా కొన్ని గ్రామాల ప్రజలు ముఖ్యంగా మహిళలు కొన్ని పదుల కిలోమీటర్ల దూరం వెళ్లి ప్రతి రోజు తాగడానికి మంచి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి దేశంలో ఉంది అంటే నమ్మశక్యం కాదు. కానీ వందల సంఖ్యలో గ్రామాలు ఎండకాలం కనీసం మంచి నీళ్లు కూడా లభించక పోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక వైపు దేశంను ప్రపంచ అగ్ర దేశాలతో సమానంగా అభివృద్ది చేస్తున్నాం అంటున్న వారు ఆ గ్రామాలను కనీసం చూడను కూడా చూడటం లేదు. మహారాష్ట్ర నాసిక్ లోని కోశింపాడ గ్రామ ప్రజలు తాగడానికి కనీసం నీరు లేకపోవడంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని చాలా మంది జనాలు బిందెలతో చాలా దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు.
చాలా లోతు ఉన్న బావిలోకి దిగి బిందేలను నింపుకుంటున్నారు. నీటి ఎద్దడి కారణంగా గ్రామస్తులు కొందరు ఏకంగా గ్రామాన్ని వదిలేసి వెళ్తున్నారట. ఇన్నాళ్లు కొన్ని నీళ్లు అయినా అందించిన ఆ బావి నుండి నీరు ముందు ముందు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ముందు ముందు ఆ బావి ఎండి పోయేలా ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బిందెల నీళ్లు తీసిన తర్వాత మళ్లీ నీళ్లు రావడానికి కొన్ని గంటల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నుడుమ కోశింపాడ గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
లోతైన బావిలో తాడు సాయంతో మహిళలు దిగుతూ నీళ్లు తీసుకు వచ్చే ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అయ్యాయి. బావిలోని మురికి నీటిని తీసుకుని వాటిని తమ పద్దతుల్లో ఫిల్టర్ చేసుకుని మట్టి కుండల్లో నింపుకుంటున్నారు.
Also Read: GT vs MI Qualifier 2 Playing 11: ఫైనల్ బెర్త్ కోసం గుజరాత్-ముంబై ఫైట్.. తుది జట్లు ఇవే!
అత్యల్ప వర్షపాతం లేకపోవడం వల్ల ఈ స్థాయి నీటి ఎద్దడి ఏర్పడింది అంటూ స్థానికులు చెబుతున్నారు. వర్షాలు తక్కువగా పడటం వల్ల నీటి మట్టం పడిపోయిందని.. వర్షాలు లేకపోవడం వల్ల భూగర్భ జలాల శాతం అనేది పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
అంతే కాకుండా భూగర్భ జలాలను మితిమీరి వినయోగించడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. అక్కడి నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు గాను రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి నీటి కనెక్షన్ ఇవ్వడం జరిగింది.
2024 వరకు ప్రతి గామానికి కూడా జల్ జీవన్ మిషన్ కింద అందరికి నీళ్లు అందేలా చేస్తామని గిరిజన అభివృద్ది శాఖ మంత్రి విజయ్ కుమార్ కృష్ణారావు గవిట్ అన్నారు. కోశింపాడ వంటి గ్రామాలు మహారష్ట్రలో పదుల సంఖ్యలో ఉన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook